రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గణనాథుడి నిమజ్జన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను సీపీ ఎం. శ్రీనివాస్ ప్రారంభించారు. గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది, పిల్లలు, మహిళల కోలాటం, ఆట పాటలు, నృత్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.