రైతు రుణమాఫీకి సంబంధించి దరఖాస్తుకు ప్రతి రైతు కేంద్రం వద్ద సమర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మండల కేంద్రానికి వెళ్లి దరఖాస్తులు సమర్పించడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రామీణ ప్రాంతాల్లోని రైతు వేదికలలో దరఖాస్తులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.