పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

84చూసినవారు
పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
లక్షెట్టిపేట పట్టణానికి చెందిన డి. సురేష్ ఆరోగ్య ఖర్చుల కోసం ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎల్ఓసీ అందజేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో సురేష్ వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్