గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తి అరెస్టు
తాండూరు మండలం బోయపల్లి గ్రామ సమీపంలోని తన ఇంటి పరిసరాలలో గంజాయి మొక్కను పెంచుతున్న భటేశ్వర్ రాయ్ ను శనివారం అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేయడంతో ఇంటి పరిసరాల్లో గంజాయి మొక్క పెంచడమే కాకుండా 44 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు