హుస్సేన్ సాగర్ కు భారీగా వస్తున్న గణనాథులు

58చూసినవారు
హుస్సేన్ సాగర్ కు భారీగా వస్తున్న గణనాథులు
హైదరాబాద్ లో భక్తి శ్రద్దల నడుమ వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ కు గణనాథులు భారీగా వస్తున్నాయి. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరిగింది. మహాగణపతిని దర్శించుకుని నిమజ్జనం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ మార్క్, ఖైరతాబాద్, హుస్సేన్ సాగర్ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్