ఈ నెల 14న మేడారంలో 'మండమెలిగే' పండుగ

51చూసినవారు
ఈ నెల 14న మేడారంలో 'మండమెలిగే' పండుగ
మేడారం మహా జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాతర ప్రారంభానికి సూచికగా ఈనెల 14న మండమెలిగే పండుగ నిర్వహిస్తామని గిరిజన పూజారులు తెలిపారు. ఇందులో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో అలుకుపోసి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి రక్షణ తోరణాలు కడతారు. అనంతరం గ్రామ దేవతలకు పూజలు చేస్తారు.

సంబంధిత పోస్ట్