కింగ్‌ఫిషర్ బీరు సీసాలో ప్లాస్టిక్ స్పూన్

79చూసినవారు
ఏపీలోని నంద్యాల జిల్లా డోన్‌లో కింగ్ ఫిషర్ బీర్ కొనుగోలు చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. అందులో ప్లాస్టిక్ స్పూన్ ఉండటంతో షాకయ్యాడు. వెంటనే షాప్ యజమానిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని, నంద్యాలలో జిల్లా అధికారికి ఫిర్యాదు చేసుకోవాలని చెప్పారు. దీంతో యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందులో స్పూన్ కాకుండా ఇంకేదైనా కనిపించని వస్తువు ఉంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్