మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూసిన విషయం తెలిసిందే. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. 1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు నెలకొల్పారు. మన్మోహన్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదైంది. ఆయన హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.