తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు?

60చూసినవారు
తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల రద్దు?
తెలంగాణలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. E-KYC ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్