పశ్చిమ చైనాలోని పర్వత ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికిి ఏకంగా 9 మంది మరణించారని చైనా ఎమెర్జెన్సీ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ రీజియన్‌లోని పర్వత ప్రాంతాల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే చైనా భూకంప పర్యవేక్షణ సంస్థ మాత్రం రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా నమోదైందని పేర్కొంది.