బ్యాంక్‌లో భారీ పేలుడు (వీడియో)

66చూసినవారు
అమెరికాలోని ఒహియా రాష్ట్రం డౌన్‌టౌన్ యంగ్‌స్టౌన్‌లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. గ్యాస్ కారణంగా బ్యాంకులో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి ఆచూకీ తెలియలేదు. ఆ వ్యక్తి ఉదయం బ్యాంకులో పనికి వెళ్లినట్లు ఆయన భార్య అగ్నిమాపక అధికారులకు తెలిపింది. శిథిలాలలో ఆ వ్యక్తి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :