భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

80చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్లాస్టిక్‌ పైపుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ఉన్న పీవీసీ పైపుల గోదాంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌లతో మంటలను ఆర్పేశారు. మంటలు ఎగిసిపడిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :