యూపీలో భారీ అగ్ని ప్రమాదం

77చూసినవారు
యూపీలో భారీ అగ్ని ప్రమాదం
యూపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మీరట్ మవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని రబ్బరు గోదాములో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :