ముంబై సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Video)

82చూసినవారు
ముంబై సమీపంలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని భివాండి తాలూకాలోని వీ లాజిస్టిక్స్ గోదాములో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. గోదాములో పెద్ద మొత్తంలో హైడ్రాలిక్ ఆయిల్, ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. గోదాము మొత్తం దగ్దం అయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్