హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మృతదేహం లభ్యం

23027చూసినవారు
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మృతదేహం లభ్యం
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చెరువులో మృతదేహం తేలుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించారు. దర్యాప్తులో మృతి చెందిన వ్యక్తి అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన వైద్యం విద్యాసాగర్ (44)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్