హుస్నాబాద్: బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శనీయుడు
అభివృద్ధిలో హుస్నాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తెస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ బొమ్మ వెంకన్న అందరికీ ఆదర్శనీయుడన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకే ప్రభుత్వం రూ. 430 కోట్లు కేటాయించిందన్నారు.