నాసిరకమైన పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

1180చూసినవారు
నాసిరకమైన పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్నిబహుజను సమాజ్ పార్టీ చేగుంట మండల పార్టీ అధ్యక్షులు తప్ప భానుచందర్ సందర్శించారు. కార్యాలయ ఆవరణలో ఉన్న పార్కింగ్ టైల్స్ పగిలిపోవడం చూసికార్యాలయం ప్రారంభించి రెండు నెలలు గడపకు ముందే ఈ విధంగా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని అతను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా పనులు నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా చూసినకాంట్రాక్టర్లు బ్లాక్లిస్టులో పెట్టి క్రిమినర్ కేసులో నమోదు చేస్తే తప్ప రానున్న రోజుల్లో ఇటువంటి నిర్లక్ష్యానికి చరమగీతం పాడలేమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ తో పనులు సక్రమంగా జరిపించేలా అధికారులు ఒత్తిడి తేవాలని సందర్భంగా గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్