మెదక్ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులపై అదనంగా డిజిటల్ క్రాప్ సర్వే భారం తగదని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ శుక్రవారం తెలిపారు. స్థానిక టీఎన్జీవో భవన్లో వ్యవసాయ విస్తరణ అధికారుల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఇదివరకే పంటల నమోదు కార్యక్రమం విస్తరణ అధికారులు విజయవంతంగా పూర్తి చేసి సాధారణ విధులు నిర్వర్తిస్తున్నామన్నారు.