మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో అకాల వర్షాలతో వంట నష్టం జరిగిన ప్రదేశాలను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పర్యటించి రైతుల యొక్క బాధలను తెలుసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అమలైతున్నటువంటి పసల్ బీమాను ఈ రాష్ట్రంలో అమలు చేసినట్లయితే ఇలాంటి విపత్తుల పరిస్థితులు వచ్చినప్పుడు రైతులకు మేలు జరిగేది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కా రణంగా రైతులు నిలువెత్తుగా ఆర్థికంగా మునిగిపోయారు ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు కండ్లు తెరిచి ఈ రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. రేపు జిల్లా కలెక్టర్ గారికి పంట నష్టపోయిన రైతుల తరఫున వినతి పత్రం ఇస్తామని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గణేష్ నాయక్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మూర్తి శంకర్, కిసాన్ మోర్చా నాయకులు మూర్తి అశోక్, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.