ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తిని రక్షించిన హోమ్ గార్డ్ మహేష్, క్యూ ఆర్ టి టీంను మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ బుధవారం అభినందించి రివార్డు అందజేశారు. అనంతరం పోలీసు ఉద్యోగం అనేది ఒక విధిలా కాకుండా సేవల చేస్తే ప్రజల నుంచి మంచి మన్ననలు పొందవచ్చని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.