మెదక్ జిల్లా ఎస్. పి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ. పి. ఎస్. ఆదేశానుసారం జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ సుభాష్ చంద్ర బోస్ ఆద్వర్యంలో మెదక్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సైబర్ నేరాలు నార్కోటిక్స్, షీ టీం వారి అవగాహన సదస్సును బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్. పి. అడ్మిన్ మహేందర్ ముఖ్య అతిదిగా హాజరై విశ్రాంత ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్ లకు అవగాహన కల్పించారు.