చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలోని శ్రీ శివాలయం వద్ద హాస్పిటల్ ముందు ఉన్న, శిధిలావస్థకు చేరిన ప్రమాదకరంగా ఉన్నా ఇంటిని, గ్రామ సర్పంచ్ శ్రీమతి మల్కానీ నీరజ పవన్ గౌడ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో కూల్చి వేశారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న గోడను కూల్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి సెక్రటరీ నాంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.