ఏడుపాయలలో పల్లకి సేవ

376చూసినవారు
ఏడుపాయలలో పల్లకి సేవ
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ఆలయం నుండి ప్రారంభమైన ఈ పల్లకి సేవ రాజగోపురం మీదుగా కొనసాగి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమం ఏడుపాయల ఈవో   సార శ్రీనివాస్, ఆధ్వర్యంలో కొనసాగగా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్ , మధుసూదన్ రెడ్డి, సాయిబాబా,   విట్టల్, నరేష్ తదితరులు పాల్గొనగా వేద బ్రాహ్మణులు రాజేష్ శర్మ ఆలయ అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పల్లకి సేవ లో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్