‘ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి’ అంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేయాలని కోరుతున్నామని, అప్పుడు వారి పరిస్థితి ఏంటో, ఎక్కడుంటారో తెలుస్తుందని బీజేపీని ఉద్దేశిస్తూ మాట్లాడారు.