మెదక్ జిల్లా చేగుంటలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఒలంపిక్ డే రన్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామాయంపేట సిఐ లక్ష్మీబాబు మాట్లాడుతూ
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని అలా రాలించినప్పుడే శారీరకంగా ఫిట్ గా ఉండి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్ గా ఉంటారో వాళ్లే విద్యలో కూడా ముందుంటారని, ప్రతి ఒక్కరు తప్పకుండా క్రీడల్లో పాల్గొని పథకాలు తీసుకురావాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు తీసుకువచ్చి తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు పేరు తీసుకురావాలని, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు జిల్లా ఒలంపిక్ డే రన్ కొర్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా ఒలింపిక్ డే రన్ కోర్ కమిటీ చైర్మెన్ కర్ణం గణేష్ రవికుమార్ మాట్లాడుతూ పూర్వకాలంలో గ్రీసు దేశంలో క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల క్రితం తరచూ యుద్దాలు జరగడం వల్ల విసిగెత్తిన ప్రజలు మార్పు కోరుకున్నారు. అప్పుడున్నటువంటి గ్రీసు రాజులు అందరూ కలిసి కొద్దిగా విరామం కోసమని గ్రీస్ దేశంలోని ఒలంపియా వద్ద ఈ క్రీడలను ఏర్పాటు చేశారని, దాంట్లో నాలుగు క్రీడలైనటువంటి హార్స్ రైడింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, రథాల పోటీలు స్టార్ట్ చేశారని , ఒలింపిక్ డే రన్ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం చేగుంటలో వందల మంది విద్యార్థిని
విద్యార్థులు క్రీడాకారులతో నిర్వహించడం చాలా గొప్ప విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ డే రన్ కోర్ కమిటీ కన్వీనర్ గోవింద్, చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్, శంకరంపేట ఎస్సై సుభాష్ గౌడ్, రామాయంపేట ఎస్సై రంజిత్, నిజాంపేట్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, చేగుంట మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్, జెడ్ పి హెచ్ ఎస్ హెచ్ఎం రమేష్, మోడల్ స్కూల్ హెచ్ఎం భూపాల్ రెడ్డి, చల్ల లక్ష్మణ్, పీడీలు శారద, వెంకట్, పిఈటి లు వనిత, బాలరాజ్ ఉపాధ్యాయులు రెహమాన్, నాయకులు సాయిబాబా సంతోష్ రెడ్డి సాయి ప్రసాద్ జిల్లా పరిషత్ హై స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ మరియు వివిధ పాఠశాలలకు చెందిన 700 మంది పైచిలుకు విద్యార్థిని
విద్యార్థులు పాల్గొన్నారు.