ఏడుపాయల ప్రాజెక్టులో నీట మునిగి వ్యక్తి మృతి

81చూసినవారు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన బర్ల రాజు అనే యువకుడు నీట మునిగి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం రాజు తన స్నేహితులతో కలిసి గురువారం ఏడుపాయల దేవాలయానికి వెళ్తూ మార్గం మధ్యలో స్నానాలు ఆచరించటం కోసం ఘనపురం ప్రాజెక్టులో దిగారు. మృతుడికి ఈత వచ్చినప్పటికీ ప్రాజెక్టు నిండు కుండలా ఉండడంతో ఊరిపి ఆడక మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్