ఎల్దుర్తి మండలం - Yeldurthy Mandal

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

మనస్తాపంతో యువకుడి బలవన్మరణం

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.ఈనాడు దిన పత్రిక ప్రచురించిన కథనం ప్రాకారం వివరాలు..మండల కేంద్రం ఎలుకపల్లికి చెందిన కానికే పోచమ్మ,మైసయ్య దంపతులకు అయిదుగురు కుమారులు.ఓ కుమార్తె ఉన్నారు.వీరందరికి వివాహాలు జరిగాయి.చిన్న కుమారుడు అనిల్ కుమార్ (25)ను ఎదులపల్లి గారాంనికి చెందిన బి.రాములు,మంగమ్మ దంపతులు ఇల్లరికం తీసుకెళ్లారు.ఆ తర్వాత 6 నెలలకు తమ కుమార్తె దీపను ఇచ్చి పెళ్లి చేసారు.వీరి మధ్య గత కొంతకాలం కలహాలు రాగ ఇరు గ్రామాల పెద్దలు పలుమార్లు పంచాయితీలు నిర్వహించి సర్దిచెప్పారు.గురువారం మరోమారు గొడవ జరుగడంతో మనస్తాపానికి గురయ్యాడు.ఈ క్రమంలోనే శుక్రవారం తమ పొలానికి వెళ్ళాడు.మధ్యాహ్నమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా..అప్పటికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ నుండి తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై మహేందర్ తెలిపారు.

మెదక్ జిల్లా