వెల్దుర్తి మండలంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

161చూసినవారు
వెల్దుర్తి మండలంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు ఘనంగా జరుపుకున్నారు. అధికారులు మువ్వన్నెల జెండా ఎగరేసి ఘనంగా 74వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల ఎంపిపి హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కరోనా వైరస్ బారిన పడకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరా చారి, తహసిల్దార్ ఆనందరావు, ఏపీఓ శంకరయ్య, వెల్దుర్తి సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, సర్పంచ్ వెంకట్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేందర్ గౌడ్, మానేపల్లి గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్, పాఠశాల చైర్మన్ దాసరి శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీ సి. సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, అధికారులు, అనధికారులు పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్