మెట్టు రామలింగేశ్వరాలయం విశేషాలివే

72చూసినవారు
మెట్టు రామలింగేశ్వరాలయం విశేషాలివే
ఓల్డ్ వరంగల్‌ జిల్లా, మడికొండ గ్రామంలో మెట్టు రామలింగేశ్వరాలయం ఉంది. త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడి శివలింగాన్ని పూజించారట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది. శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్