AP: తల్లి బతికుండగానే కుమారులు పెద్దకర్మ భోజనాలు పెట్టిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండల పరిధిలోని ముచ్చర్లలో జరిగింది. రంగమ్మ (80) అనే వృద్ధురాలు తన ఆస్తిని కుమారులకు సమానంగా పంచారు. చనిపోయాక కొడుకులు పెద్దకర్మ భోజనాలు ఘనంగా పెడతారో లేదో అని డౌట్ ఆమెకు వచ్చింది. దీంతో కుమారులను పిలిచి తాను బతికుండగానే ఆ కార్యక్రమం చేయాలని కోరింది. తొలుత షాకైన చివరికి బంధువులు, గ్రామస్థులను పిలిచి భోజనాలు వడ్డించారు. తల్లి కోరికను కుమారులు తీర్చి ఆమెకు ఆనందాన్ని కలిగించారు.