ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీలో ఎవరు ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 'అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇస్తాం. గత ఐదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. పెళ్లైన మహిళలకు పేర్లు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. స్థలాలు లేని వారికి ఏ విధంగా ఇవ్వాలనే అంశాన్ని కూడా చర్చిస్తున్నాం. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్‌లను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పంపిణీ చేస్తాం' అని స్పష్టం చేశారు.