మంత్రి సీతక్క కీలక హెచ్చరిక

80చూసినవారు
మంత్రి సీతక్క కీలక హెచ్చరిక
మహిళలను వేధిస్తే సహించే ప్రసక్తే లేదని ఆకతాయిలను మంత్రి సీతక్క హెచ్చరించారు. మాదాపూర్ టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్ లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్ వర్కింగ్ నిర్వహించిన వార్షిక లీడర్ షిప్ కాన్ క్లేవ్ 2024లో పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు చేసే మనస్తత్వం ఉందని, అందువల్లనే మహిళలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్