హత్యకు ముందు MH మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దసరా సందర్భంగా ముంబైలో తన కుమారుడు, MLA జీషన్ సిద్దిఖీ ఆఫీసు బయట బాణసంచా కాలుస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు దుండగులు ముఖానికి ముసుగులు కప్పుకొని వాహనంలో అక్కడికి చేరుకున్నారు. అదను చూసి సిద్దిఖీపై కాల్పులు ప్రారంభించారు. 9.9 MM తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకటి సిద్దిఖీ గుండెల్లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.