26 ఏళ్లుగా మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా బాధితుడు

60చూసినవారు
26 ఏళ్లుగా మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా బాధితుడు
ఇరవై ఆరేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి చివరకు పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు తేలిన ఘటన ఆల్జీరియా దేశంలో వెలుగు చూసింది. 1998లో ఆల్జీరియా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఒమార్ బీ (19) కనిపించకుండా పోయాడు. కానీ, ఇంతకాలం అతడు తన పొరుగింట్లోనే బందీగా ఉన్నట్టు అనూహ్యంగా బయటపడింది. అయితే, నిందితుడి మంత్ర ప్రయోగం కారణంగా బాధితుడు సాయం కోసం గొంతెత్తి పిలవలేకపోయాడని స్థానిక మీడియా ఆశ్చర్యకర కథనం వెలువరించింది.

సంబంధిత పోస్ట్