30 సంత్సరాల క్రితం మరణించిన తమ కుమార్తెకు వరుడు కావలెను అని కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటంబం గత సోమవారం స్థానిక దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. కులల్ కులంలో పుట్టిన తమ కుమార్తెకు వరుడు కావలెను అని కోరారు. వధువు 30 ఏళ్ళ క్రితం మరణించిందని తెలిపారు. ఇదే కులంలో పుట్టి, 30 ఏండ్ల క్రితం మరణించి ఉంటే చాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటన వైరల్ కావడంతో ఈ పెళ్లి తంతుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.