డెన్మార్క్ ప్రధానిపై దాడిని ఖండించిన మోదీ

64చూసినవారు
డెన్మార్క్ ప్రధానిపై దాడిని ఖండించిన మోదీ
డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌పై జరిగిన దాడిని ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఖండించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. ఫ్రెడెరిక్సెన్‌పై దాడి వార్త తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆ పోస్టులో పేర్కొన్నారు. కాగా, కోపెన్‌హాగన్‌ స్క్వేర్‌ వద్ద డెన్మార్క్‌ ప్రధానిపై ఓ దుండగుడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఫ్రెడెరిక్సెన్‌ షాక్‌కు గురయ్యారు.

ట్యాగ్స్ :