ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ వినూత్న నిరసన చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి ఆతిశీ ఇంటి ముందు ఆమె ఆందోళనకు దిగారు. మురికినీళ్లతో నిండిన బాటిల్‌ను తీసుకొచ్చి నిరసన తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఇలాంటి నీళ్లేనా సరఫరా చేసేదంటూ ఆమె నిలదీశారు. ఈ మేరకు ఆమె మురికినీళ్లకు సంబంధించిన వాటర్‌ను ఆతిశీ ఇంటి ముందు పారబోసి బాటిల్‌ను గేటు ముందు పెట్టింది.