భారత క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సంపాదించుకున్నాడు. జార్ఖండ్ డైనమైట్‌గా ధోనీని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ధోనీ 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ధోనీ టీమిండియా తరుపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలను బాదాడు.