సమాజంలో చాలామంది ఆరోగ్యంపై అశ్రద్ధ వల్ల అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే రోగాల బారిన పడుతున్నారు. మందు, సిగరెట్, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటివి సేవిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొందరు ఒత్తిడితో కూడా రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుత కాలంలో బీపీ, షుగర్ వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది. ఆహారపు అలవాట్లలో తేడాలు రావడంతో క్యాన్సర్ బారిన పడుతున్నారు.