ఆలయ నిర్మాణానికి మసీదు స్థలం విరాళంగా ఇచ్చిన ముస్లింలు!

50చూసినవారు
ఆలయ నిర్మాణానికి మసీదు స్థలం విరాళంగా ఇచ్చిన ముస్లింలు!
తమిళనాడు తిరుప్పూరు జిల్లాలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఆలయ నిర్మాణానికి స్థలం లేకపోవడంతో స్థానిక ముస్లింలు మసీదు స్థలాన్ని దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు. జిల్లాలోని ఒట్టపాళెయం రోస్ గార్డెన్ ప్రాంతంలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ మసీదు ఉన్నప్పటికీ హిందువులకు ఆలయం లేదు. ప్రస్తుతం గుడి పనులు పూర్తయి సోమవారం కుంభాభిషేకం జరిగింది.