అమెరికాలోని నార్త్ కరోలినా అడవుల్లో హైకింగ్ చేస్తున్న ఓ వ్యక్తికి మిస్టీరియస్ వస్తువు కనిపించింది. కార్బన్ ఫైబర్‌తో కూడిన ఈ ఆబ్జెక్ట్ 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు, ఒక అంగుళం మందంతో కాలిపోయి ఉంది. దీనిపై బోల్ట్‌లు కూడా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక నుంచి ఇది భూమిపై పడి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందంటున్నారు.