సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనపై 3 కేసులు నమోదు చేసిన సిట్ అధికారులు, విగ్రహాన్ని ధ్వంసం చేసిన మహారాష్ట్రలోని ఠాణె ప్రాంతానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.