తిరుమల టికెట్లు అమ్ముకుని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా బెంజ్ కారు కొన్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు పోయిన ప్రతీ సారి వందల మందిని దర్శనానికి తీసుకెళ్తుందని అన్నారు. ఆమె మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని.. కథ చెప్పాలంటే చాలా ఉందన్నారు. రోజాను రాజకీయాల్లోకి తెచ్చి చంద్రబాబు తప్పు చేశాడన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయికి చేరుకున్నావా? అంటూ ఫైర్ అయ్యారు.