అనారోగ్యంతో సూగురి వెంకటమ్మ అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు, న్యాయవాది మల్లెపల్లి జగన్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామంలోని మృతురాలు వెంకటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, తనవంతుగా 50 కేజీల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.