నాగర్ కర్నూల్: కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
నాగర్ కర్నూల్: కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తిమ్మాజీపేట మండలంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ మంజూరు చేసిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం సాయంత్రం అందజేశారు. కదిరే పాండు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, బాలరాజు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు, బొట్క భీముడు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్