Feb 14, 2025, 17:02 IST/
ఏపీలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది: జగన్
Feb 14, 2025, 17:02 IST
ఏపీలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు, కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని మండిపడ్డారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ పేర్కొన్నారు.