ఆధ్యాత్మికామృతం.. భక్తి మార్గం
ఏడు పదుల వయస్సుల్లోనూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు పలువురు వృద్ధులు. సంప్రదాయ వాయిద్యాలతో భజనలు చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో ఔత్సాహికులు, భక్తులు భజనలు చేస్తూ ఆకట్టుకుంటూ ఔరా అని అబ్బురపరుస్తున్నారు. హార్మోనియం, మృదంగం, ఇతర సంగీత పరికరాలు వాయిస్తున్నారు.