రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసినందుకు గాను నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆదేశానుసారం శనివారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ముడావత్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టివిక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.