బొమ్మలరామరం సోలిపేట ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. స్వామి వివేకానంద యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉడుతల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి, చాక్లెట్లు పంపిణీ చేచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ నాయక్, విద్యార్థి నాయకులు మోహన్ నాయక్, శ్రీనివాస్, వినోద్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్త పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్ లో తెలుపగలరు…