
తుర్కపల్లి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
తుర్కపల్లి మండలంలోని టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయ ఓటర్లను కలిసి భాజపా అభ్యర్థి పులి సర్వోత్తమ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ మాజీ మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మేకల శ్రీనివాస్, దొంకిన రాజు గౌడ్ పాల్గొన్నారు.